Comedy Dialogues involving Kids

Kid's corner-1

Scene involving master Bharat and his mother...

( మాస్టర్ భారత్  ని కుక్క కరిచాక "మగధీర" మూవీ లో "పంచదార బొమ్మ" సాంగ్ ని తన స్టైల్ లో పాడుతూ   ...వాళ్ళ అమ్మ తో )   
బాబు: కుక్క పైన  చేయేస్తే కరిచి నన్ను పంపిందే ....డాక్టర్  దగ్గరికి పొమ్మని చెప్పిందే (puvvu paina cheyeste, kasiri nannu tittindhe ..pasidi puvvu nuvvani pampindhe ...)

అమ్మ: కుక్క నోట్లో చెయ్యెందుకు పెట్టావ్రా..దానికి బుద్ది లేక పోతే నీకేమయింది రా...... ఆఆ..... అ...

బాబు: కుక్క నన్ను కరిచింది...అమ్మ నన్ను తిట్టింది

           ఏమిటంట నేను చేసిన పాపమ్..(Gaali ninnu taakindi, nela ninnu taakindi Nenu ninnu taakithe Tappa ...
                                     (కుక్కని చూస్తూ)                                     

          
దీన్ని  చంపేటందుకు పుట్టానీ  జన్మ..దీన్ని చంపక పోతే వృదాఈ జన్మా...ఆఆ..... అ... (Ninnu pondetanduke puttane Gumma ..Nuvvu andakapothe vrudha ee Janma aa aa aa aa aa ..)


Conversation between Krishna Bhagavan and his kid

Kid: అదేంటి డాడి, పక్కింటి బబ్లు గాడు సేం నాలానే వున్నాడు... నాకన్ని నీ పోలికలు అంటావు కదా? (అమాయకంగా ఫేస్ పెట్టి)


(బబ్లు మాటలకు కంగు తిన్న కృష భగవాన్ తనలో తానూ మాట్లాడుకుంటూ)

 
Krishna Bhagavan: కొంప దీసి నా సైడ్ సెటప్ అలివేలు మన పక్కనే వున్న వాటా లో అద్దె కు దిగిందా ఏంటి ???

 Krishna Bhagavan: ఏరా వెదవ , నీకు అన్ని అనుమానాలే మీ అమ్మ లాగ...అవును రా నీకు మొన్న ఎగ్జాంలో మాథ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి?


Kid: 100 కి 10


Krishna Bhagavan: బుద్ది లేదు వెదవ ...ఈ అనుమానాలు నీకు క్లాసు రూం లో వచ్చి వుంటే మార్కులు అయినా వచ్చి వుండేవి ...వెళ్లి చదువు కో...
                               ( బాబు ఇంట్లో కి వెళ్లి పోతాడు )

 
Krishna Bhagavan: అవును...ఈ మాటలన్నీ మా ఆవిడ వినలేదు కదా?? ( బ్యాక్ గ్రౌండ్ లో పూజ చేస్తూ గంట కొట్టిన సౌండ్ )

Krishna Bhagavan: హమ్మయ్య...ఈ అలివేలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో నా ప్రాణానికి అనుకుంటూ పక్క ఇంటికి వెళుతాడు


We happen to see lot of comedy scenes involving kids now a days in movies...I know, some times they are heavy for a kid to utter for their age but some times they are rib tickling too :) here is a scene between sunil and his friend's kid

 సునిల్: ఫ్రెండ్ వాల్ల ఇంటికి రాగానె ఫ్రెండ్ వాల్ల బాబు(5-10 ఇయర్స్ ఏజ్) ని చూస్తూ...ఏరా బుజ్జి...చాల హైట్ పెరిగావు రా....
బుజ్జి: నెను నా వయకు కి తగ్గ పెరిగాను...మీదె మీ వయసు కు తగ్గ పెరగ లేదు

సునిల్(ఫేస్ అదొలా పెట్టుకొని): ఎంట్రా అదీ
బుజ్జి: అదె మీ బుర్ర....



సునిల్: ఆఆఆఆ.....                             




Scene involving a kid and heroine Trisha at hero's house....
(heroine త్రిష(స్వాతి),వాల్ల పక్కింటి పాప(పింకి)తొ కలిసి hero(అజయ్) వాల్ల ఇంటికి పొద్దున్నే వెళుతుంది)

స్వాతి: ఆంటీ, నేను స్వాతి ని, మా పక్కింటి పాప పింకి తొ వచ్చా (ఇంటి చుట్టూ అజయ్ కొరకు దొంగలా చూస్తూ)
సుధ ఆంటి(కిచెన్ లొ వున్న అజయ్ వాల్ల మదర్):ఎమ్మా, ఎలా వున్నావు? ఇపుడే దోస చేసా, breakfast చెయ్యండి ఇద్దరు
స్వాతి: లేదాంటి, ఇపుడే మా ఇంట్లొ నేను,పింకి చేసే వచ్చాము (అజయ్ కొరకు ఇంకా చూస్తూ)
పింకి(అమాయకంగా ఫేస్ పెట్టి): అదేంటక్కా, నేను మీ ఇంట్లొ breakfast చెసింది మొన్న కదా?
స్వాతి(కంగుతిన్న ఫేస్ తొ): ఆ....అవునవును...పింకి తినలెదు (మనసులో,పోయి పోయి దీన్ని ఎందుకు తీసుకొచ్చాను రా దెవుడా అనుకుంటూ)


(సుధ ఆంటి అర్ధం చేసుకొని, పింకికి దొస తెచ్చి పెడుతుంది)
సుధ ఆంటి(doubtful గా ఫేస్ పెట్టి) : ఎమ్మా,ఏదన్నా పని వుండి వచ్చావా?
స్వాతి(కంగారు పడుతూ): లేదాంటీ, వూరికే వచ్చా, మిమ్ములను కలుద్దాము అని
పింకి(దోస తింటూనే, question mark ఫేస్ పెట్టి): అదేంటక్కా, నాతో, అజయ్ కి సైట్ కొట్టదానికి వెలుతున్నాము అని చెప్పావు?
(పింకి ఇంకొన్ని బాంబులు పేల్చకముందే, కంగుతిన్న స్వాతి పింకిని ఎత్తుకొని మరీ కంగారుగా బయటికి వెళుతూ
                                                                      
స్వాతి: వెళ్ళొస్తా ఆంటీ


Scene between comedian Krishna Bhagavan and a kid(wearing t-shirt over the shirt like in pokiri style) at kids's house

క్రిష్ణ భగవాన్: ఏం బుజ్జి, నాన గారు ఇంట్లో వున్నారా?

Kid: లేరు, అయినా నా పేరు బుజ్జి గిజ్జి కాదు పోకిరి మహేష్ బాబు

క్రిష్ణ భగవాన్ : అబ్బో, పోకిరి ఇంటి పేరా?


Kid: లేదు, ముద్దు పేరు                                 


(కౌంటర్ కు కంగు తిన్న క్రిష్ణ భగవాన్,వీడితో ఇంగ్లీష్ లొ మాట్లాడి buildup ఇద్దాము అనుకొని)


క్రిష్ణ భగవాన్ : you see actually, my name Krishna bhagavan hain( English and Hindi కలిపి గ్రామర్ తో సంబంధం లేకుండా మాట్లాడుతూ)

Kid: నేను అడిగానా?

క్రిష్ణ భగవాన్(కంగుతిని kid తల మీద చెయ్యి వేసి,వెటకారంగా ) : నీకు గ్లామర్ ఎక్కువ అనుకుంటా!!!

Kid: మీకు గ్రామర్ తక్కువ అనుకుంటా!!!

(కంగారు పడ్డ క్రిష్ణ భగవాన్, బయటికి వెళుతుంటే)

Kid(సీరియస్ గా face పెట్టి): నాన గారు వస్తే ఏమి చెప్పమంటారు?

క్రిష్ణ భగవాన్: నీ లాంటి కొడుకును మాత్రం కనొద్దు అని చెప్పు

Kid(face అదోలా పెట్టి) : ఆఆఆఆ

In the same movie, another scene involving the same kid and a friend of his dad's visiting kid's home


సునిల్: హ హ హ ...ఏం బాబు, నాన్న గారు వున్నారా? ... హ హ హ
(kid లేరు అని చెప్పబోయే లోపల)


సునిల్: హ హ హ ...బయటికి వెల్లి వుంటారు లె...ఇంట్లొ వుంటె నువ్వు చెప్పే వాడివి కదా ...... హ హ హ

సునిల్: హ హ హ ఏ స్కూల్ లొ చదువుతున్నవు బాబు?

(kid లేదండి అని answer చెప్పబోయే లోపల)

సునిల్: హ హ హ...పక్కనే వున్న స్కూల్ లొ నె చదువుతుంటావు లె..లేక పొతే నువ్వు చెప్పి వుండే వాడివి కదా... హ హ హ                        

kid (మనసులొ వెటకారంగా): ఆ....నాకు ఆ అద్రుష్టం కూడనా, అప్పటి నుండి batting and bowling మీదే కదా

సునిల్: హ హ హ... క్లాస్ లొ ఏ ర్యాంక్ వస్తావు బాబు?

(ఎలాగు ఈ సారి కూడ ఆయనే answer చెప్పేసుకుంటాడు అని kid calm గా వుంటాడు)
సునిల్: హ హ హ... నిన్నే అడిగేది బాబు...క్లాస్ లొ ఏ ర్యాంక్ వస్తావు అని...హ హ హ

(హమ్మయ్య, ఈ సారి కి చాన్స్ వచ్చింది కదా అని kid answer చెప్పేలొపే)

సునిల్: హ హ హ, first rank ఏ వస్తావు అనుకుంటా, face చూస్తెనే చెప్పేయొచ్చు హ హ హ

kid (మనసులొ): పర్లేదు, ఈ తెలివి అయినా ఏడిసి చచ్చింది ఈయనకి

సునిల్: హ హ హ ...నాన్న గారు వచ్చే సరికి చాలా time అవుతుంది అనుకుంటా ...నేను వచ్చానని చెప్పమ్మ ...హ హ హ

kid: మీ పేరు?

సునిల్: హ హ హ..... నా పేరు వాగుడు వసంత రావ్ అంటారమ్మ... హ హ హ

kid (కొంచం మెల్ల గా అనుకుంటూ): అబ్బా, పేరు మాత్రం correct గా సరిపోయింది

సునిల్: ఏంటమ్మ ఏదొ అంటున్నావు.... హ హ హ

(ఏమి లేదండి అని kid అనబోయె అంతలో)


సునిల్: హ హ హ ఏమి అనుండవు లె...ఎమన్నా అంటే నాకు వినపడి వుండేది కద... హ హ హ (అంటూ బయటికి వెళ్ళి పోతాడు)

(సునిల్ వెళ్ళగానే, kid వాళ్ళ dady cell phone కి కాల్ చేసి )

kid: ఏoటి dady, మొన్న మీరు మా friends ని ఇంటికి తీసుకు వస్తే ఏమన్నారు?


Dady (phone లో) : ఎంట్రా, ఇలాంటి వాల్లతో నీకు friendship ఎంటి రా అన్నాను
kid: అంటే అన్నారు అంటారు కాని, మరి మీరు ఎలాంటి వాళ్ళతో friendship చేస్తున్నారు మరి? ఒకరికి గ్రామర్ తక్కువ, ఇంకొరికి వాగుడు ఎక్కువ

Dady (phone లో): వెదవ, నన్ను అనేంత ఎదిగావారా నువ్వు...వుండు ఇంటికి రానివ్వు నీ పని చెబుతా....

(దెబ్బకు బయపడి kid phone పెట్టెస్తాడు)




Looking at the progess report of his kid, father asking question to the kid `


Father: ఏరా, అన్ని సబ్జెక్ట్స్ లొ బాగానె మార్కులు వచ్చి సైన్స్ లొ ఎందుకు తక్కువ వచ్చాయి రా?


kid: అన్ని సబ్జెక్ట్స్ లొకెల్లా నాకు నచ్చని ఒకే ఒక సబ్జెక్ట్ ఈ సైన్స్(in Tagore style)

 Father: ఒహొ, అలాగా అయితే అన్ని money లొ కెల్లా నాకు నచ్చని ఒకే ఒక money నీకిచ్చె pocket money..అది  ఈ రోజు నుండి కట్

kid: ఆఆఆ....





Comedy Dialogues involving Adults


Coversation between beggar venu madhav and Dharmavarapu

ధర్మవరపు సుబ్రమణ్యం ఒక రోజు కూర్చొని అడుక్కుంటున్న వేణు మాధవ్ కి చిల్లర ఇస్తాడు
వేణు మాధవ్: హలో, Excuse me, మీ చిల్లర మీరు తీసుకోండి
ధర్మవరపు సుబ్రమణ్యం : అదేంటి?

వేణు మాధవ్: ఈ రోజు ఆది వారం, అడుక్కోము..అదేంటి అడుక్క్కునే వాడికి ఆది వారం ఏంటి అని ఆలోచిస్తున్నావ...అంతే, మాకు ఒక అసోసియేషన్ వుంది...దానికి కొన్ని రూల్స్ వున్నాయి.         


ధర్మవరపు సుబ్రమణ్యం : అబ్బో
(తను వేసిన చిల్లర తీసుకొని వెళ్లి పోతాడు...వీడికి బాగా బుద్ది చెప్పాలి అని లోపల అనుకుంటూ....)


                            ( నెక్స్ట్ సీన్ )
నెక్స్ట్ సండే ధర్మవరపు సుబ్రమణ్యం వేణు మాధవ్ ముందు నుండే వెళుతూ ఫిఫ్టీ రూపీస్ నోట్ ని వేణు మాధవ్ చిప్ప లో వేసినట్టే వేసి తీసుకెళతాడు ....
వేణు మాధవ్:( ఫేస్ మీద కొట్టుకుంటూ ) : కంట్రోల్ కంట్రోల్ ...రూల్స్ రూల్స్
సేం సీన్ రిపీట్ అవుతుంది ..ఒక సారి హండ్రెడ్ రుపీస్ నోట్, మరొక సారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ .......

ఈ సారి 1000 రూపీస్ నోట్ ని వేణు మాధవ్ చిప్ప లో వేసినట్టే వేసి తీసుకో పోతుంటే వేణు మాధవ్ టక్కున ఆ నోట్ ని తీసుకుంటాడు........
ధర్మవరపు సుబ్రమణ్యం : హలో, ఎంటమ్మ ఈ రోజు ఆది వారం......అడుక్కోవు కదా


వేణు మాధవ్: హహహః... అక్కడే నువ్వు నా చిప్ప లో కాలు వేసింది.....నిన్ననే మా అసోసియేషన్ మీటింగ్ అయ్యింది ....రూల్స్ మారాయి...economy బాలేదు అని సండే కూడా extra days పని చేయాలని డిసైడ్ చేసారు.....అందుకే ఈ రోజు కూడా extra shift..
ధర్మవరపు సుబ్రమణ్యం : ఆఆఆఆఆఆఆఅ ...బొక్క బొక్క ....






Wife and Husband humor


Conversation between Sunil and his wife Hema

సునిల్( with wife Hema): హె, మీకు computers కి వున్న తేడా ఎంటో తెలుసా?

సునిల్: computers కి ఒక్క సారి చెబితే అర్దం అవుతుంది ...మీకు వంద సార్లు చెప్పినా waste

Hema(to సునిల్): అహ, మరి మీకు computers కి వున్న తేడా ఎంటో తెలుసా?
Hema వెటకారంగా: వాటికి buildup business రెండు ఎక్కువే ...మీకు buildup ఎక్కువ business తక్కువ
Sunil: కంగుతిని
Hema: ఆడవాల్ల ని మరీ తక్కువ చేసి మాట్లాడకండి,ప్రతి మగ వాడి విజయం వెనుక ఆడది వుంటుంది తెలుసా?
Sunil వెటకారంగా: ఆ ఎందుకు వుండదు...ఆ మగాడు వెనుక వేసిన డబ్బు, కీర్తి దొబ్బెయ్యడానికి రెడి గా వుంటుంది.
Hema: చ, మీతొ పెట్టుకున్నందుకు నన్ను నేను తిట్టుకోవాలి 
      
Sunil: హహహ్హహ ...ఈ బుద్ది 5 నిమిషాల ముందు వుండాలి...నాతొ పెట్టుకోకె!!!


                           ( Next Scene in the same movie)

Hema: ఎమండోయ్, పక్కింటి శైలజ కట్టుకున్న చీర చూసార? ఎంత బాగుందో!

Sunil: ఆ ఎందుకు బాగుండదు 5 వేలు బొక్క కదా నాకు

                    ( బయటికి అన్నానేంటి అని నాలుక కరుచుకుంటూ)

Conversation between Kondavalasa and his friend comparing his wife with cell phone

సెల్ ఫోన్ లో రింగ్ టోన్ చేంజ్ చేసుకోవచ్చు . ....మా ఆవిడ టోన్ సారీ స్టోన్ ని కంట్రోల్ చెయ్యలేము ( బ్యాక్ గ్రౌండ్ లో తెలంగాణా శకుంతల వాయిస్ )


సెల్ ఫోన్ sleek గా ఇలియాన లా వుంటుంది ..... మా ఆవిడ రోడ్ రోలర్ సైజు లో వుంటుంది

 
సెల్ ఫోన్ కి మంత్లీ బిల్ ఒక్కటే ...మా ఆవిడ షాపింగ్ కి, సరదాల కి షికార్ల కి బిల్

 సెల్ ఫోన్ జేబు లో పడేస్తే వుంటుంది ...మా ఆవిడ చేయి ఎపుడు నా జేబు లో నే వుంటుంది (డబ్బు కోసం)

 

సెల్ ఫోన్ కి ఎక్కువ ఛార్జ్ చేస్తే పేలుతుంది .....మా ఆవిడ ఎక్కువ ఛార్జ్ అయితే (తాగితే ) నాకు పేలుతుంది        


Phone coversation between Dharmavaru Subramanyam and his wife Apoorva Aunty


అపూర్వ ఆంటి:  ఏమండి, మీరు క్యాంప్ లో వున్నంత కాలం మగాల్లని     తప్ప ఆడవాల్లని మీ హొటెల్ గది లోకి రానివ్వకండి.

ధర్మవరపు: ఓకె, అలాగే

అపూర్వ ఆంటి: నేను కూడ మనింట్లొ అదే రూల్ follow అవుతా 
                                          ( అని ఫోన్ పెట్టేస్తుంది)
ధర్మవరపు: ఓకె, అలాగే


( కంగుతిని తప్పు realize అయ్యి సెల్ ఫొన్ నుండి call back చేస్తాడు )

 

ధర్మవరపు: ఒసినీ అమ్మ కడుపు మాడ ...ఫొన్ ఎత్తవే
              
( అటు నుండి అపూర్వ ఆంటి ఫొన్ లో voice)

మీరు కాల్ చేసిన number బిజి గా వున్నది..దయచేసి 10 నిమిషాల తరువాత కాల్ చెయ్యండి         
                                   
ధర్మవరపు( ఏడుస్తూ): బ బ బ బ బ .....


Phone conversation between Ananth and his father in law Dharmavarapu Subramanyam

అనంత్: ఎంటి మామయ్య నాకు ఇలాంటి అమ్మయిని ఇచ్చి నాకు అన్యాయం చేసారు                                                                                           
ధర్మవరపు: అయ్యయ్యో, ఏమి అయ్యింది బాబు...మా అమ్మాయి ఏమి చెసింది?

 అనంత్(బాద పడుతూ):నా కర్మ కాలి TV లొ announce చేసారు కొద్ది సేపట్లొ ప్రేక్షకులను అమెరికా తీసుకెళ్తాం అని , అంతే అన్ని బట్టలు సర్దుకొని suite case  తో TV ముందు కూర్చుంది వాల్ల తమ్ముడి దగ్గరికి వెళుతా అని


ధర్మవరపు: హ్మ్ హ్మ్ ...నా బాద ఎవరికి చెప్పాలి బాబు, నాకు ఆ అన్యాయం 25 years క్రితమే జరిగింది.ఇక్కడ మీ     అత్తయ్య..........                                           


( Scene showing her sitting infront of TV with her suite case)

 అనంత్: ఆఆఆ... అమ్మొ ఫామిలి ఫామిలి మొత్తం వెంగలప్పలె వున్నారు కద

We see some old illiterate people asking for an help at a bus station in reading a bus name plate...here is a scene involving a well educated brahmi software engineer(like Brahmanandam) and a very old women from village speaking in a Telangana dialect at bus station

ఓల్డ్ వుమెన్: ఓ కొడ్కా...గీ బస్సు మిర్యాలగూడ పొతదా..జర చెప్పు


బ్రమ్మి: ఈ బస్సు వెల్లదు అవ్వ...నీ బస్సు వచాక చెబుతా లె


ఓల్డ్ వుమెన్: సరె కొడ్కా...నువ్వు సల్ల గుండ
మల్లి కొంచం సెపు అయ్యాక...ఇంకొ బస్సు రాగానె
ఓల్డ్ వుమెన్: ఓ కొడ్కా...గీ బస్సు నాదెనా..

 
బ్రమ్మి(కొద్దిగా కోపం తొ): ఈ బస్సు నీది నాది కాదు R.T.C వాల్లది కాని మిర్యాలగూడ పోయె బస్సు వచ్చాక చెబుతా లె ......అప్పటి నుండి ప్రాణాలు తోడేస్తున్నావు అవ్వ                   


ఇలా రెందు మూదు సార్లు అయ్యాక(these scenes shown in fast forward motion) అవ్వ కి కోపం వచ్చి


ఓల్డ్ వుమెన్: ఓ కొడ్కా...ప్రతీ బస్సు పోదు అంటున్నావు...అసలు నీకు నిజంగా సదువు వస్తదా కొడ్కా...  
                      

బ్రమ్మి(ఎడుపు మొహం తొ): ఆఆ.....                          







Scene invloving Dharamavarapu subramanyam and Sunil wherein dharmavarapu gives an introduction of sunil to a lady receptionist


Receptionist: సుబ్బా రావు గారు,మీ పక్కన వున్న ఈయన ఎవరు? 
 
Dharmavarapu: ఎంటీ, న.రా గారు ఎవరో తెలియదా?? (తెలియదా తెలియదా అంటూ రీసౌండ్ background లో)


Receptionist(చిరాకు గా): ఎహె, ఆపండి... పెద్ద తెలుసుకొవాల్సిన ఫేస్ లా లెదే ఆయనది?

సునిల్(కోపం తొ): కంట్రొల్ ...కంట్రొల్ అనుకుంటూ ఫేస్ మీద కొట్టుకుంటూ                                   


Dharmavarapu : ఏ సినిమాలొ లేని introduction వుంది మా న.రా గారికి


Dharmavarapu: ఏవరి పేరు చెబితే పసి పిల్లలు పాలు తాగకుండా coke కావాలని మారాం చెస్తారో ...ఆయనెనమ్మ ఈ నల్ల రామ్ముర్తి(న.రా) గారు

 
సునిల్(నవ్వాలొ లేక ఏడువాలొ అర్థం కాక): వీడు పొగుడు తున్నాడ లేక తిడుతున్నాడా???(అని మనసు లో అనుకుంటూ)

Scene Involving Brahmanandam and krishna Bhagawan at a flat rental office in Hyderabad..
క్రిష్ణ భగవాన్: hello, ఇక్కడ flats manager మీరేనా?


Brahmanandam (గర్వంగా) బయట బొర్డ్, ఇక్కడ tie చూస్తే అర్దం కాలేదా నేనే manager ని అని

క్రిష్ణ భగవాన్: తాళి కట్టగానే పెళ్ళాం కాదు...tie కట్టగానే manager కారు

Brahmanandam: అబ్బో, మీరు చాల Intelligent అనుకుంటా ? 




క్రిష్ణ భగవాన్: మీరు కాదు అనుకుంటా


Brahmanandam(కౌంటర్ కు కంగు తిని): Hi, my name is పిజ్జ ...పిఠాపురం జగన్నాథ రావ్ ...అందరు ముద్దు గా పిజ్జ అంటుంటారు...


క్రిష్ణ భగవాన్: నువ్వు pizza వొ burger వొ అయితె నాకేంటి గాని flats ఏమైనా కాలి గా వున్నాయా?     


Brahmanandam: బయట "no flats vacant" అన్న బోర్డ్ చూడలేదా?


క్రిష్ణ భగవాన్: లేదే


Brahmanandam: అయినా ఎలా చూస్తారు, నేనే ఇంకా board పెట్టలేదుగా హహహహహ ....


క్రిష్ణ భగవాన్( వెదవ జోక్ కి వొల్లు మండి ) మీ టాప్ floor కాలి అనుకుంటా?


Brahmanandam (అమాయకంగా face పెట్టి ) లేదే ......టాప్ floor లొ రావ్ గారు and రెడ్డి గారు వుంటారు కదా?


క్రిష్ణ భగవాన్ : నేను అన్నది building లొ టాప్ floor కాదు నీ బాడిలొ టాప్ floor .....బ్రేన్(brain)


Brahmanandam: ఆ...............(అని నోరు తెరుసుకొని)           
క్రిష్ణ భగవాన్(బయటికి వెళ్ళిపోతు) ఆ నోరు ముయ్యి...పిజ్జ లోకి ఈగలు పోతాయి

Brahmanandam( face మాడిపోయి ): ఆ...............

Comedy Dialogues in College Campus


Scene involving Sunil and a gilr(Radha) wherein Sunil writes a letter to her expressing his love.She replies a letter back giving retort.....

Sunil(writes the following letter to Radha):

రాధ...రాధ
తీర్చవా నా మన్మద బాధ


Immediately, Radha replies him back the following letter

ఒరె గధ
మా అన్న పెద్ద దాద
చెప్పానంటే చేస్తాడు నీ వధ


Sunil(looking at the letter): ఎంత ముద్దు గా నా పర్సనాల్టి కి తగ్గట్టు గధ అని పిలుస్తుంది రా రాధ(గద ని ఊహించు కుంటూ & typical నవ్వు తొ



M.S.Narayana(Physics lecturer): ఒరే తోలు మందం వెదవ, ఆమె అన్నది ఆ గద కాదు, గధ అంటె గాడిద అని అర్ధం హిందీ లొ, అయినా నీకు తెలుగు యె సరిగా తెలియదు, హిందీ ఎలా అర్ధం అవుతుంది నా పిచ్చి కాక పోతె
sunil(with a sad clown face): ఆ ఆ ........           


In the same movie, Sunil tries another girl by writing a love letter .....


సునీల్: hey,   పింకి,                                                                                      ప్రేమ లేఖ రాసా...నీకు అంది వుంటది ..అని పాట పాడుతూ సిగ్గు పడుతుంటే
పింకి(పాట కంటిన్యూ చేస్తూ): రిప్లై కూడా రాసా...అది చేరి వుంటది
సునీల్: అదేంటి, నాకు రాలేదు కదా


పింకి (వెటకారంగా): ఆ... నీకు ఎందుకు వస్తది ...అది రాసిన శ్రీను కి వస్తది ....
సునీల్: (మెల్లగా అనుకుంటూ) ఓసి దయ్యమా...ఆ శీను గాడు రాసాడు అని దీనికి ఎలా తెలిసింది చెప్మా????

(అది విన్న పింకి ) ఆ నీ ఫేస్ కి అంత మంచి హ్యాండ్ రైటింగ్ కూడా నా....వెళ్ళు వెల్లవో
సునీల్: (ఆ మాట కి కంగు తిని ) వెళ్తాం వెళ్తాం.. ఏదో ఒక రోజు నా అందాల దేవత నా తలుపు తట్టక పోతుందో . నువ్వు కుళ్ళు తో కుళ్ళి పోవా ...

(అటే వైపున వెళుతున్న ఫిజిక్స్ లెక్చరర్ M.S నారాయణ ఆ మాటలు విని)

M.S. నారాయణ: అందాల దేవత తలుపు తట్టడం దేవుడెరుగు కాని ఫస్ట్ క్లాసు రూం తలుపు తట్టు...క్లాసు రూం కి రాక చాల రోజులు అవుతుంది....ఈ ఇయర్ అన్న పాస్ క నా సబ్జెక్టు


Classroom humor:
Comedy scene involving a lecturer and a student in a class wherein class is empty except Suman shetty

Mastaaru: ఏరా...క్లాస్ లో ఎవరు లేరు నువ్వు తప్ప...అందరు ఎక్కడికి వెళ్ళారు?
Suman shetty: మరేమొ మరేమొ

Mastaaru:అబ్బ...అలా నస పెట్టకుండా చెప్పురా(పెద్ద స్వరం తో)
Suman shetty: సార్, మీరు అలా గట్టి గా అడిగితె చెప్పెది మరిచి పొతా ఆ....
Mastaaru:అబ్బొ...నీకు ఇలాంటి కలా పోషణలు కూడ వున్నాయా నాయనా....
Suman shetty: ఓ ......దానికే బొచ్చెడు వున్నాయి సార్

Mastaaru: ఇపుడు నీ Dhoom-3 sequel story నాకు ఎందుకు కాని మిగతా వాల్లు ఎక్కడికి వెళ్ళారో చెప్పరా?
Suman shetty:వాల్లు అందరు షకీల సినిమా కి వెళ్ళారు సార్

Mastaaru: వోరి వెదవల్లార ....మరి నువ్వు ఎందుకు వెల్లలేదు రా?
Suman shetty: సార్, నాకు అన్ని 'ల' లొకెల్లా నచ్చని ఒకే ఒక 'ల' షకీల
Mastaaru: ఆఆఆ..........

Mastaaru: అబ్బో..నీకు నచ్చే 'ల' ఎవరు నాయనా?

Suman shetty(సిగ్గు పడుతూ):సరళ సార్

Mastaaru: ఓరి వెదవ..ఏది మన క్లాస్ లొ వున్న సరళ నా?

Suman shetty: లేదు సార్, పక్క సెక్షన్ లొ వున్న మీ అమ్మాయి సార్
Mastaaru: ఆఆఆ
scene invloving lecturer Strict Srinivasa Rao(Dharmavarpu) and students
Strict Srinivasa Rao: సైలెన్స్....సైలెన్స్ నా పెరు అసలె Strict Srinivasa Rao, నాకు పడంది సౌండ్ pollution

one of the students: ఇది ఎదొ సినిమా క్యాప్షన్ లా వుందే????

Strict Srinivasa Rao: సైలెన్స్....సైలెన్స్ , మీ exam మార్కులు ఇచ్చాక నెను పెడత గా మీకు క్యాప్షన్లు
Opening answer papers and started reading names of students...

Strict Srinivasa Rao: కస్తూరి వెంకట రమణ, మీ ఇంటి పేరు బాగుంది రా..
students: పేరుకే కస్తూరి సార్, వాల్ల ఇంట్లో అంతా గబ్బిలాల వాసన ( students నవ్వుతూ)

Strict Srinivasa Rao: సైలెన్స్ సైలెన్స్ ,next paper గొట్టం గొపాల క్రిష్ణ, ఏమి రా ఇంత తక్కువ మార్కులు వచ్చాయి

గొట్టం గొపాల క్రిష్ణ(chitram seenu): సార్, exam ముందు అన్ని చదివాను సార్, కాని తీరా exam లొ అన్ని మరిచి పొయాను సార్

Strict Srinivasa Rao: ఒహొ అలాగా, అయితే చిరంజీవి సినిమా ఇంద్ర ఎపుడు రిలీజ్ అయ్యిందో చెప్పు?
గొట్టం గొపాల క్రిష్ణ(chitram seenu): 24th July 2002 సార్

Strict Srinivasa Rao: ఆహ,ఈ విషయాలు బాగా గుర్తుంటాయిరా...చదువు మాత్రం గుర్తుండదు వెదవ.. వెల్లి కూర్చొ

Strict Srinivasa Rao: next paper, బాషా, ఏ నాన్నా, 100 questions ఇస్తే ఒక్కటె question కి answer రాసావు?
basha(babloo): ఈ బాషా ఒక్క question కి answer రాస్తె 100 questions కి answer రాసినట్టె (in a typical basha style lo)


Strict Srinivasa Rao: ఈ తెలివికి ఏమి తక్కువ లేదు, ఇదే తెలివి చదువులొ పెట్టు వెదవ...వెల్లు

Strict Srinivasa Rao: next paper, అత్తిలి సత్తి బాబు, ఏమిట్రా ఈ మార్కులు, ఈ అమ్మాయిలను చూసి బుద్ది తెచ్చుకో బాగుపడుతావు(showing the girls row in the class)

అత్తిలి సత్తి బాబు(with a sad face): ఆ... బాగా చెప్పారు..ఈ అమ్మయిలను చూసి చూసె నేను ఇలా తయారు
అయ్యింది

College campus Humor:


Scene involving Venu Madhav and his thotti gang teasing girls in the college campus......
వేణు మాధవ్: పాప పి.సుశీల, ఇట్రామ్మా

Girl: ఏయ్, నా పేరు సుశీల కాదు, కోమల

వేణు మాధవ్:అబ్బో, ఎదో ఒక 'ల ' కాని నీకు డ్యాన్స్ వచ్చా?

కోమల: ఏయ్, మా నాన్న ఎవరో తెలుసా?

వేణు మాధవ్: ఏ, నీకు తెలియదా, కనీసం మీ అమ్మకు అయినా తెలుసా??

(తొట్టి గ్యాంగ్ అంతా గొల్లుమని నవ్వగానె, ఆ అమ్మాయి కొపంగా వెళ్ళి పోతుంది అక్కడ నుండి)

(ఒక్క సారిగా భూకంపం వచ్చినట్టుగా,తొట్టి గ్యాంగ్ వూగిపొతుంటారు)
వేణు మాధవ్: ఒరె, ఏమి అయ్యింది రా, భూకంపం ఏమైనా వచ్చిందారా ?

తొట్టి గ్యాంగ్: అన్న,భూకంపం కాదు ఎకంగా సునామి, అటు చూడు ఆ jeans అమ్మాయి, బుల్డొజర్ కి కిల్లర్ జీన్స్ వేసినట్టు వుండి ఇటే వస్తుంది

వేణు మాధవ్: అమ్మొ, ఇదా గజలక్ష్మి, దాన్ని ఏమి అనకండి, విన్నదంటే అందరిని మడత పెట్టి బ్రేక్ ఫాస్ట్ లా తింటుంది..అసలె నేను పెళ్ళి కావలసిన వాడిని..


Chitram seenu(లోపల అనుకుంటూ) : ఇంకా ఆ ఆశ కూడనా?

వేణు మాధవ్(గజలక్ష్మి దగ్గరకు రాగానె): వెల్లమ్మ వెల్లు, క్యాంటీన్ అటు వైపు(అంటూ చేత్తో డైరెక్షన్ చూపుతూ)
(అటు గా వస్తున్న ఇంకో అమ్మాయిని ఆపి)

వేణు మాధవ్: హెల్లొ, నీ పేరు ఏంటీ?

Lady(in telangana accent): ఏం తమ్మి, నా పేరు స్వర్ణ అలియాస్ రాములమ్మ,చంద్రన్న దళం , నల్లమల ఫారెస్ట్...ఈ మధ్యనే జనజీవన స్రవంతిలో కలిసిపోయి, చదువు షురూ చేశ్న

తొట్టి గ్యాంగ్(అందరు రాగం తీస్తూ): ఎర జండ ఎర జండ ఎన్నియల్లొ..ఎర ఎర్రని జండ ఎన్నియల్లొ
వేణు మాధవ్(భయపడుతూ): అమ్మొ, సరె అక్క, ఈ కాలెజ్ లో ఏమి కావాలన్న నన్ను అడుగక్క, గీడనె వుంటా...పోయిరా అక్క

(చక్కగా నూనె పెట్టుకొని దువ్వుకొని, సోడాబుడ్డి కళ్ళద్దాలతొ,చేతిలొ పుస్తకాలు పట్టుకొని ఒక అమ్మయి అటు వస్తుంటె)

వేణు మాధవ్: ఏమ్మా నీ పేరెంటీ?

Girl: నా నామ ధ్యేయం సరస్వతి అండి

తొట్టి గ్యాంగ్(అందరు రాగం తీస్తూ): చదువుల సుందరి ఇదిగొ రా...నడిచే లైబ్రరి ఎందుకు రా...

వేణు మాధవ్: ఆహ, పేరుకి తగ్గట్టు వున్నావు..వెళ్ళి బాగా చదువుకోవమ్మా..నీలాంటి వాళ్ళేనమ్మ ఈ దేశానికి కావల్సింది

chitram seenu (మెల్లిగా అంటూ) : లేకుంటే నీ లాంటి వాల్లా.....
వేణు మాధవ్(ఆ comment విని) : ఏమిరో నోరు లేస్తుంది, తిత్తి తీస్త...

chitram seenu: సారి అన్న

వేణు మాధవ్(posh gaa): ఒకె ఒకె, its alright!!

(అటుగా వెళుతున్న ఏజ్ లొ పెద్దగా వున్న ఒక లేడి(తెలంగాణ శకుంతల)ని comment చేస్తూ...)
వేణు మాధవ్: హెల్లొ, ఈ ఏజ్ లొ నీకు కాలెజ్ అవసరమా??

(ఆ లేడి ఈ తొట్టి గ్యాంగ్ దగ్గరకు వచ్చి)

లేడి: ఈ తొట్టి గ్యాంగ్ కి లీడర్ ఎవడ్రా?

Chitram Seenu: హెల్లొ, ఎంత ఈడియట్,పోకిరి, దేశముదురు లాగ కనిపిస్తే మాత్రం మా అన్ననే గుర్తుపట్టవా?? మా అన్న Title పులి కింద caption ...వీడు చాలా కతర్నాక్

(వేణు మాధవ్ చాలా గర్వంగా ఫీల్ అవుతూ.....)

లేడి(వేణు మాధవ్ గల్లా పట్టుకొని): ఎరా, నువ్వు కతర్నాకా...నాకంటెనా..నెను ఎవరో తెలుసా మఫ్టిలో వున్న S.I. Encounter Ellamma ని రా....నీ పిల్లలని స్కూల్ కి పంపే ఏజ్ లొ ఇంకా కాలెజ్ లొనె వుండి ఆడ పిల్లలని ఎడిపిస్తావురా సచ్చినోడా

(మిగతా వాల్లు అందరు పారి పొతారు అక్కడ నుండి)
వేణు మాధవ్: అక్కా, అక్కా, తప్పయ్యిందక్కా, ఇంకా ఎవరిని tease చెయ్యనక్క


(Encounter Ellamma ఇంకా కొడుతూనె వుంది.....)

వేణు మాధవ్(చిలిపి గా ఏడుస్తూ): నీ సొంత తమ్ముడి ని అయితే గిట్లనే కొడ్తవా అక్కా......

Encounter Ellamma( (ఇంకా కొడుతూనె): నాకు నీ లాంటి తమ్ముడే వుంటే ఎపుడో encounter చేసేసి అందరికి భొజనాలు పెట్టేద్దును రా ఎదవ...
వేణు మాధవ్(ఏడుస్తూ) : వామ్మొ...వాయ్యొ

Encounter Ellamma: ఏందిరా నీ పేరు?
వేణు మాధవ్:పులి అక్క
Encounter Ellamma(ఇంకా కొడుతూనె): పులి ఏంది రా పులి...పులి అయితే, జంగల్ లొ వుండాలె గాని గీడేమిజేస్తున్నవ్ రా....
వేణు మాధవ్(అమాయకంగా face పెట్టుకొని): అసలు పేరు పుల్లయ్య అక్క, posh గా వుంటుందని పులి అని పెట్టుకున్నక్కా.....
Encounter Ellamma: దీంతల్లి, పండ్లల్ల పాసు పెట్టుకొని పేరు మాత్రం posh గా పెట్టుకుంటావ్రా??
వేణు మాధవ్: అక్కా, అక్కా, తప్పయ్యిందక్కా...వదిలెయ్యక్క ఈ కాలేజ్ సైడ్ కి రానక్క....రైతు బజార్ లొ Reliance ఫోన్లు అమ్ముకుంటక్కా బుద్ధి గా...

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం
Web Page Counter