Comedy Dialogues in College Campus


Scene involving Sunil and a gilr(Radha) wherein Sunil writes a letter to her expressing his love.She replies a letter back giving retort.....

Sunil(writes the following letter to Radha):

రాధ...రాధ
తీర్చవా నా మన్మద బాధ


Immediately, Radha replies him back the following letter

ఒరె గధ
మా అన్న పెద్ద దాద
చెప్పానంటే చేస్తాడు నీ వధ


Sunil(looking at the letter): ఎంత ముద్దు గా నా పర్సనాల్టి కి తగ్గట్టు గధ అని పిలుస్తుంది రా రాధ(గద ని ఊహించు కుంటూ & typical నవ్వు తొ



M.S.Narayana(Physics lecturer): ఒరే తోలు మందం వెదవ, ఆమె అన్నది ఆ గద కాదు, గధ అంటె గాడిద అని అర్ధం హిందీ లొ, అయినా నీకు తెలుగు యె సరిగా తెలియదు, హిందీ ఎలా అర్ధం అవుతుంది నా పిచ్చి కాక పోతె
sunil(with a sad clown face): ఆ ఆ ........           


In the same movie, Sunil tries another girl by writing a love letter .....


సునీల్: hey,   పింకి,                                                                                      ప్రేమ లేఖ రాసా...నీకు అంది వుంటది ..అని పాట పాడుతూ సిగ్గు పడుతుంటే
పింకి(పాట కంటిన్యూ చేస్తూ): రిప్లై కూడా రాసా...అది చేరి వుంటది
సునీల్: అదేంటి, నాకు రాలేదు కదా


పింకి (వెటకారంగా): ఆ... నీకు ఎందుకు వస్తది ...అది రాసిన శ్రీను కి వస్తది ....
సునీల్: (మెల్లగా అనుకుంటూ) ఓసి దయ్యమా...ఆ శీను గాడు రాసాడు అని దీనికి ఎలా తెలిసింది చెప్మా????

(అది విన్న పింకి ) ఆ నీ ఫేస్ కి అంత మంచి హ్యాండ్ రైటింగ్ కూడా నా....వెళ్ళు వెల్లవో
సునీల్: (ఆ మాట కి కంగు తిని ) వెళ్తాం వెళ్తాం.. ఏదో ఒక రోజు నా అందాల దేవత నా తలుపు తట్టక పోతుందో . నువ్వు కుళ్ళు తో కుళ్ళి పోవా ...

(అటే వైపున వెళుతున్న ఫిజిక్స్ లెక్చరర్ M.S నారాయణ ఆ మాటలు విని)

M.S. నారాయణ: అందాల దేవత తలుపు తట్టడం దేవుడెరుగు కాని ఫస్ట్ క్లాసు రూం తలుపు తట్టు...క్లాసు రూం కి రాక చాల రోజులు అవుతుంది....ఈ ఇయర్ అన్న పాస్ క నా సబ్జెక్టు


Classroom humor:
Comedy scene involving a lecturer and a student in a class wherein class is empty except Suman shetty

Mastaaru: ఏరా...క్లాస్ లో ఎవరు లేరు నువ్వు తప్ప...అందరు ఎక్కడికి వెళ్ళారు?
Suman shetty: మరేమొ మరేమొ

Mastaaru:అబ్బ...అలా నస పెట్టకుండా చెప్పురా(పెద్ద స్వరం తో)
Suman shetty: సార్, మీరు అలా గట్టి గా అడిగితె చెప్పెది మరిచి పొతా ఆ....
Mastaaru:అబ్బొ...నీకు ఇలాంటి కలా పోషణలు కూడ వున్నాయా నాయనా....
Suman shetty: ఓ ......దానికే బొచ్చెడు వున్నాయి సార్

Mastaaru: ఇపుడు నీ Dhoom-3 sequel story నాకు ఎందుకు కాని మిగతా వాల్లు ఎక్కడికి వెళ్ళారో చెప్పరా?
Suman shetty:వాల్లు అందరు షకీల సినిమా కి వెళ్ళారు సార్

Mastaaru: వోరి వెదవల్లార ....మరి నువ్వు ఎందుకు వెల్లలేదు రా?
Suman shetty: సార్, నాకు అన్ని 'ల' లొకెల్లా నచ్చని ఒకే ఒక 'ల' షకీల
Mastaaru: ఆఆఆ..........

Mastaaru: అబ్బో..నీకు నచ్చే 'ల' ఎవరు నాయనా?

Suman shetty(సిగ్గు పడుతూ):సరళ సార్

Mastaaru: ఓరి వెదవ..ఏది మన క్లాస్ లొ వున్న సరళ నా?

Suman shetty: లేదు సార్, పక్క సెక్షన్ లొ వున్న మీ అమ్మాయి సార్
Mastaaru: ఆఆఆ
scene invloving lecturer Strict Srinivasa Rao(Dharmavarpu) and students
Strict Srinivasa Rao: సైలెన్స్....సైలెన్స్ నా పెరు అసలె Strict Srinivasa Rao, నాకు పడంది సౌండ్ pollution

one of the students: ఇది ఎదొ సినిమా క్యాప్షన్ లా వుందే????

Strict Srinivasa Rao: సైలెన్స్....సైలెన్స్ , మీ exam మార్కులు ఇచ్చాక నెను పెడత గా మీకు క్యాప్షన్లు
Opening answer papers and started reading names of students...

Strict Srinivasa Rao: కస్తూరి వెంకట రమణ, మీ ఇంటి పేరు బాగుంది రా..
students: పేరుకే కస్తూరి సార్, వాల్ల ఇంట్లో అంతా గబ్బిలాల వాసన ( students నవ్వుతూ)

Strict Srinivasa Rao: సైలెన్స్ సైలెన్స్ ,next paper గొట్టం గొపాల క్రిష్ణ, ఏమి రా ఇంత తక్కువ మార్కులు వచ్చాయి

గొట్టం గొపాల క్రిష్ణ(chitram seenu): సార్, exam ముందు అన్ని చదివాను సార్, కాని తీరా exam లొ అన్ని మరిచి పొయాను సార్

Strict Srinivasa Rao: ఒహొ అలాగా, అయితే చిరంజీవి సినిమా ఇంద్ర ఎపుడు రిలీజ్ అయ్యిందో చెప్పు?
గొట్టం గొపాల క్రిష్ణ(chitram seenu): 24th July 2002 సార్

Strict Srinivasa Rao: ఆహ,ఈ విషయాలు బాగా గుర్తుంటాయిరా...చదువు మాత్రం గుర్తుండదు వెదవ.. వెల్లి కూర్చొ

Strict Srinivasa Rao: next paper, బాషా, ఏ నాన్నా, 100 questions ఇస్తే ఒక్కటె question కి answer రాసావు?
basha(babloo): ఈ బాషా ఒక్క question కి answer రాస్తె 100 questions కి answer రాసినట్టె (in a typical basha style lo)


Strict Srinivasa Rao: ఈ తెలివికి ఏమి తక్కువ లేదు, ఇదే తెలివి చదువులొ పెట్టు వెదవ...వెల్లు

Strict Srinivasa Rao: next paper, అత్తిలి సత్తి బాబు, ఏమిట్రా ఈ మార్కులు, ఈ అమ్మాయిలను చూసి బుద్ది తెచ్చుకో బాగుపడుతావు(showing the girls row in the class)

అత్తిలి సత్తి బాబు(with a sad face): ఆ... బాగా చెప్పారు..ఈ అమ్మయిలను చూసి చూసె నేను ఇలా తయారు
అయ్యింది

College campus Humor:


Scene involving Venu Madhav and his thotti gang teasing girls in the college campus......
వేణు మాధవ్: పాప పి.సుశీల, ఇట్రామ్మా

Girl: ఏయ్, నా పేరు సుశీల కాదు, కోమల

వేణు మాధవ్:అబ్బో, ఎదో ఒక 'ల ' కాని నీకు డ్యాన్స్ వచ్చా?

కోమల: ఏయ్, మా నాన్న ఎవరో తెలుసా?

వేణు మాధవ్: ఏ, నీకు తెలియదా, కనీసం మీ అమ్మకు అయినా తెలుసా??

(తొట్టి గ్యాంగ్ అంతా గొల్లుమని నవ్వగానె, ఆ అమ్మాయి కొపంగా వెళ్ళి పోతుంది అక్కడ నుండి)

(ఒక్క సారిగా భూకంపం వచ్చినట్టుగా,తొట్టి గ్యాంగ్ వూగిపొతుంటారు)
వేణు మాధవ్: ఒరె, ఏమి అయ్యింది రా, భూకంపం ఏమైనా వచ్చిందారా ?

తొట్టి గ్యాంగ్: అన్న,భూకంపం కాదు ఎకంగా సునామి, అటు చూడు ఆ jeans అమ్మాయి, బుల్డొజర్ కి కిల్లర్ జీన్స్ వేసినట్టు వుండి ఇటే వస్తుంది

వేణు మాధవ్: అమ్మొ, ఇదా గజలక్ష్మి, దాన్ని ఏమి అనకండి, విన్నదంటే అందరిని మడత పెట్టి బ్రేక్ ఫాస్ట్ లా తింటుంది..అసలె నేను పెళ్ళి కావలసిన వాడిని..


Chitram seenu(లోపల అనుకుంటూ) : ఇంకా ఆ ఆశ కూడనా?

వేణు మాధవ్(గజలక్ష్మి దగ్గరకు రాగానె): వెల్లమ్మ వెల్లు, క్యాంటీన్ అటు వైపు(అంటూ చేత్తో డైరెక్షన్ చూపుతూ)
(అటు గా వస్తున్న ఇంకో అమ్మాయిని ఆపి)

వేణు మాధవ్: హెల్లొ, నీ పేరు ఏంటీ?

Lady(in telangana accent): ఏం తమ్మి, నా పేరు స్వర్ణ అలియాస్ రాములమ్మ,చంద్రన్న దళం , నల్లమల ఫారెస్ట్...ఈ మధ్యనే జనజీవన స్రవంతిలో కలిసిపోయి, చదువు షురూ చేశ్న

తొట్టి గ్యాంగ్(అందరు రాగం తీస్తూ): ఎర జండ ఎర జండ ఎన్నియల్లొ..ఎర ఎర్రని జండ ఎన్నియల్లొ
వేణు మాధవ్(భయపడుతూ): అమ్మొ, సరె అక్క, ఈ కాలెజ్ లో ఏమి కావాలన్న నన్ను అడుగక్క, గీడనె వుంటా...పోయిరా అక్క

(చక్కగా నూనె పెట్టుకొని దువ్వుకొని, సోడాబుడ్డి కళ్ళద్దాలతొ,చేతిలొ పుస్తకాలు పట్టుకొని ఒక అమ్మయి అటు వస్తుంటె)

వేణు మాధవ్: ఏమ్మా నీ పేరెంటీ?

Girl: నా నామ ధ్యేయం సరస్వతి అండి

తొట్టి గ్యాంగ్(అందరు రాగం తీస్తూ): చదువుల సుందరి ఇదిగొ రా...నడిచే లైబ్రరి ఎందుకు రా...

వేణు మాధవ్: ఆహ, పేరుకి తగ్గట్టు వున్నావు..వెళ్ళి బాగా చదువుకోవమ్మా..నీలాంటి వాళ్ళేనమ్మ ఈ దేశానికి కావల్సింది

chitram seenu (మెల్లిగా అంటూ) : లేకుంటే నీ లాంటి వాల్లా.....
వేణు మాధవ్(ఆ comment విని) : ఏమిరో నోరు లేస్తుంది, తిత్తి తీస్త...

chitram seenu: సారి అన్న

వేణు మాధవ్(posh gaa): ఒకె ఒకె, its alright!!

(అటుగా వెళుతున్న ఏజ్ లొ పెద్దగా వున్న ఒక లేడి(తెలంగాణ శకుంతల)ని comment చేస్తూ...)
వేణు మాధవ్: హెల్లొ, ఈ ఏజ్ లొ నీకు కాలెజ్ అవసరమా??

(ఆ లేడి ఈ తొట్టి గ్యాంగ్ దగ్గరకు వచ్చి)

లేడి: ఈ తొట్టి గ్యాంగ్ కి లీడర్ ఎవడ్రా?

Chitram Seenu: హెల్లొ, ఎంత ఈడియట్,పోకిరి, దేశముదురు లాగ కనిపిస్తే మాత్రం మా అన్ననే గుర్తుపట్టవా?? మా అన్న Title పులి కింద caption ...వీడు చాలా కతర్నాక్

(వేణు మాధవ్ చాలా గర్వంగా ఫీల్ అవుతూ.....)

లేడి(వేణు మాధవ్ గల్లా పట్టుకొని): ఎరా, నువ్వు కతర్నాకా...నాకంటెనా..నెను ఎవరో తెలుసా మఫ్టిలో వున్న S.I. Encounter Ellamma ని రా....నీ పిల్లలని స్కూల్ కి పంపే ఏజ్ లొ ఇంకా కాలెజ్ లొనె వుండి ఆడ పిల్లలని ఎడిపిస్తావురా సచ్చినోడా

(మిగతా వాల్లు అందరు పారి పొతారు అక్కడ నుండి)
వేణు మాధవ్: అక్కా, అక్కా, తప్పయ్యిందక్కా, ఇంకా ఎవరిని tease చెయ్యనక్క


(Encounter Ellamma ఇంకా కొడుతూనె వుంది.....)

వేణు మాధవ్(చిలిపి గా ఏడుస్తూ): నీ సొంత తమ్ముడి ని అయితే గిట్లనే కొడ్తవా అక్కా......

Encounter Ellamma( (ఇంకా కొడుతూనె): నాకు నీ లాంటి తమ్ముడే వుంటే ఎపుడో encounter చేసేసి అందరికి భొజనాలు పెట్టేద్దును రా ఎదవ...
వేణు మాధవ్(ఏడుస్తూ) : వామ్మొ...వాయ్యొ

Encounter Ellamma: ఏందిరా నీ పేరు?
వేణు మాధవ్:పులి అక్క
Encounter Ellamma(ఇంకా కొడుతూనె): పులి ఏంది రా పులి...పులి అయితే, జంగల్ లొ వుండాలె గాని గీడేమిజేస్తున్నవ్ రా....
వేణు మాధవ్(అమాయకంగా face పెట్టుకొని): అసలు పేరు పుల్లయ్య అక్క, posh గా వుంటుందని పులి అని పెట్టుకున్నక్కా.....
Encounter Ellamma: దీంతల్లి, పండ్లల్ల పాసు పెట్టుకొని పేరు మాత్రం posh గా పెట్టుకుంటావ్రా??
వేణు మాధవ్: అక్కా, అక్కా, తప్పయ్యిందక్కా...వదిలెయ్యక్క ఈ కాలేజ్ సైడ్ కి రానక్క....రైతు బజార్ లొ Reliance ఫోన్లు అమ్ముకుంటక్కా బుద్ధి గా...

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం
Web Page Counter